Showing posts with label Eenadu analysis. Show all posts
Showing posts with label Eenadu analysis. Show all posts

Wednesday, April 3, 2019

Eenadu Analysis - 3 April 2019

1. నకిలీ వార్తల కట్టడికి వాట్సాప్  టిప్ లైన్ 

- నకిలీ వార్తలపై చర్యలకు సామాజిక మాధ్యమం వాట్సాప్ నడుం బిగించింది . 
- వినియోగదారులు తాము అందుకునే సమాచారంలో ప్రామాణికతను తనిఖీ చేసేందుకు వీలు కల్పించే చెక్ పాయింట్ టిప్ లైన్ ను ఆవిష్కరించింది . 
- దీన్ని భారత్ కు చెందిన అంకుర పరిశ్రమ ప్రోటో అభివృద్ధి చేసింది . 
- వదంతులతో కూడిన డేటా బేస్ ను ఏర్పాటు చేయడం లో ఇది తోడ్పడుతుంది . 

2. విశ్రాంత జీవితానికి సుప్రీం భరోసా 

- దేశవ్యాప్తంగా వేతన జీవులకిది శుభవార్త . 
- ప్రైవేటు రంగం లో పనిచేస్తున్న ఉద్యోగులు , కార్మికులు పదవి విరమణ సమయంలో అధిక పింఛను పొందేందుకు సుప్రీమ్ కోర్ట్ వీలు కల్పిచింది . 
- ఇక నుంచి ఉద్యోగులు పదవి విరమణ సమయానికి తీసుకునే చివరి సగటు వాస్తవిక మూలవేతనం , డిఏ పై ఈపిఎఫ్ పింఛను లెక్కించేందుకు మార్గం సుగమమయింది. 


Tuesday, April 2, 2019

Eenadu Analysis - 2 April 2019

1. నిఘా కు నింగి సాయం

- ఇస్రో మొదటిసారిగా 3 కక్ష్యల మిషన్ ను ప్రయోగించి సత్తాచాటింది .
- శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా లోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి పోలార్ సాటిలైట్ లాంచ్ వెహికల్ సి-45 వాహన నౌక నింగి లోకి దూసుకెళ్లింది .
- ఇమిశాట్ ను డిఆర్డిఓ రూపొందించింది .
- దేశ సరిహద్దులలో ఉగ్రవాదుల చొరబాట్లను పసిగట్టడం లో ఇమిశాట్ ఏంటో సహకరించనుంది .

2. సిబిఐ ఉత్తమ అధికారి గా బీపీ రాజు .

- సిబిఐ లో డీఎస్పీ హోదా లో విధులు నిర్వర్తిస్తున్న పశ్చిమ గోదావరి కి చెందిన బండి పెద్దిరాజు .
- ఈ అవార్డును సిబిఐ ప్రస్తుత డైరెక్టర్ - రిషి కుమార్ అందజేశారు .
- సిబిఐ లోని ప్రతి శాఖలో ఉత్తమ పనితీరు కనబరిచిన అధికారులకు ఈ అవార్డు అందజేస్తారు .


Monday, April 1, 2019

Eenadu Analysis - 1 April 2019

1. పాన్ - ఆధార్ అనుసంధానం గడువు పెంపు

- పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవడానికి గల గడువు ను మరో ఆరు నెలలు పెంచినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తెలిపింది .
- సెప్టెంబర్ 30 వరకు అనుసంధానం చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు పేర్కొంది .
- ఆధార్ పై గడువును పొడిగించడం ఇది ఆరవ సారి .

2. మీడియా విపణిలో భారత్ హవా

- 2021 నాటికి అగ్రశ్రేణి - 10 దేశాల్లో చేరిక
- అసోచామ్ - పీడబ్ల్యుసి నివేదిక
- మీడియా - వినోద రంగం పై దేశ తలసరి వ్యయం 2021 నాటికి 31 డాలర్లు ( 2080 ) కు చేరే అవకాశం ఉంది .

Sunday, March 31, 2019

Eenadu Analysis - 31 March 2018

1. రాష్ట్రం లో తొలిసారి
- ఎన్నికల సంఘం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో తొలిసారిగా వివి ఫ్యాట్ యంత్రాలను ప్రవేశపెట్టనుంది . 
- వీటి ద్వారా తాము ఓటు వేసిన అభ్యర్థికే ఆ ఓటు పడిందా లేదా అని ఓటర్లు నిర్దారించుకోవచ్చు 
- ఏప్రిల్ 11 న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వీటిని వినియోగించనున్నారు . 
- ఈ వివి పాట్ యంత్రాలలో 7 సెకన్ల పాటు అభ్యర్థి పేరు పార్టీ గుర్తున్న స్లిప్పు కనిపిస్తుంది . 

2. ప్రపంచం లోనే తొలి 5జి కలిగిన ప్రాంతంగా షాంగై . 
- 5జి కవరేజ్ , బ్రాడ్ బ్యాండ్ గిగాబైట్ నెట్ వర్కులను రెండింటిని ఉపయోగిస్తున్న ప్రపంచంలోనే తొలి ప్రాంతంగా షాంగై అవతరించింది . 
- 5జి అన్నది 4జి ఎల్ టి ఈ నెట్ వర్క్  ల కన్నా 10 నుంచి 100 రెట్లు అధిక డౌన్లోడ్ వేగం కలిగి ఉంటుంది . 

3. పీఎస్ఎల్ వి రిహార్సల్ పూర్తి 
- భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ లో శనివారం నిర్వహించిన పోలార్ సాటిలైట్ లాంచ్ వెహికల్ సి-45 రిహార్సల్ విజయవంతమైంది. 
-  పీఎస్ఎల్ వి సి-45 ప్రయోగం సోమవారం ఉదయం 9.27 గంటలకు జరిగేలా అధికారికంగా ప్రకటించారు . 
- ఈ వాహన నౌక డిఆర్ డిఓ కు చెందిన ఇమిసాట్ తో పాటు విదేశాలకు చెందిన 28 ఉపగ్రహాలను మూడు కక్ష్యల్లో వాటిని ప్రవేశపెట్టనుంది . 

4. ఈ - లెర్నింగ్ శిక్షణలో తెలంగాణా కు మొదటి స్థానం . 
- ప్రభుత్వ ఉద్యోగులకు  ఈ - లెర్నింగ్ శిక్షణలో వరుసగా రెండో సంవత్సరం తెలంగాణా కు మొదటి స్థానం దక్కింది .