Wednesday, April 3, 2019

Eenadu Analysis - 3 April 2019

1. నకిలీ వార్తల కట్టడికి వాట్సాప్  టిప్ లైన్ 

- నకిలీ వార్తలపై చర్యలకు సామాజిక మాధ్యమం వాట్సాప్ నడుం బిగించింది . 
- వినియోగదారులు తాము అందుకునే సమాచారంలో ప్రామాణికతను తనిఖీ చేసేందుకు వీలు కల్పించే చెక్ పాయింట్ టిప్ లైన్ ను ఆవిష్కరించింది . 
- దీన్ని భారత్ కు చెందిన అంకుర పరిశ్రమ ప్రోటో అభివృద్ధి చేసింది . 
- వదంతులతో కూడిన డేటా బేస్ ను ఏర్పాటు చేయడం లో ఇది తోడ్పడుతుంది . 

2. విశ్రాంత జీవితానికి సుప్రీం భరోసా 

- దేశవ్యాప్తంగా వేతన జీవులకిది శుభవార్త . 
- ప్రైవేటు రంగం లో పనిచేస్తున్న ఉద్యోగులు , కార్మికులు పదవి విరమణ సమయంలో అధిక పింఛను పొందేందుకు సుప్రీమ్ కోర్ట్ వీలు కల్పిచింది . 
- ఇక నుంచి ఉద్యోగులు పదవి విరమణ సమయానికి తీసుకునే చివరి సగటు వాస్తవిక మూలవేతనం , డిఏ పై ఈపిఎఫ్ పింఛను లెక్కించేందుకు మార్గం సుగమమయింది. 


No comments:

Post a Comment