1. వాట్సాప్ లో కొత్త అప్షన్
- ఇక పై ఏదైనా వాట్సాప్ గ్రూప్ లో ఎవరి పేరు చేర్చాలన్నా వారి అనుమతి తప్పనిసరి చేస్తూ వాట్సాప్ ఓ అప్షన్ ను అందుబాటులోకి తెచ్చింది .
- స్మార్ట్ ఫోన్ లోని వాట్సాప్ సెట్టింగ్స్ లో ' నోబడి , మై కాంటాక్ట్స్ , ఓన్లీవన్ ' అనే మూడు అప్షన్లు ఉంటాయి .
- నోబడి ఎంచుకుంటే మీ అనుమతి లేనిదే మిమ్మల్ని ఎవరు గ్రూప్ లో చేర్చలేరు .
- మై కాంటాక్ట్స్ ఎంపిక చేసుకుంటే మీ ఫోన్ అడ్రెస్స్ బుక్ లో ఉన్నవారు మాత్రమే గ్రూప్ లో యాడ్ చేయగలరు .
- ఈ రెండు అప్షన్ లలో ఏది ఎంచుకున్నా మిమ్మల్ని గ్రూప్ లో చేర్చాలనేవారి నుంచి ఒక సందేశం వస్తుంది .
- 3 రోజుల్లోగా ఓకే చెబితేనే గ్రూప్ లో చేరినట్లు .
2. పారా మిలిటరీ దళాల భత్యాలపై ఐటీ మినహాయింపు .
- పారా మిలిటరీ దళాల్లో పనిచేస్తున్న జవాన్లకు తీపికబురు .
- ప్రతికూల భత్యానికి ఆదాయ పన్ను నుంచి మినహాయింపు లభించనుంది .
- ఇది ఆచరణ రూపం దాలిస్తే సీఆర్పీఎఫ్ , బిఎసెఫ్ , సి ఐ ఎస్ ఎఫ్ , ఐటి బిపి , ఎస్ ఎస్ బి లలో పనిచేస్తున్న దాదాపు 9 లక్షల మంది జవాన్లకు లబ్ది కలగనుంది .
3. జియో చేతికి హాప్టిక్
- కుత్రిమ మేధా సంస్థ హాప్టిక్ ను రూ. 700 కోట్లకు స్వాధీనం చేసుకున్నట్లు రిలయన్స్ జియో ప్రకటించింది .
- హాప్టిక్స్ లో 87 శాతం వాటాను జియో కొనుగోలు చేసింది .
- హాప్టిక్ అన్నది చాట్ ఆధారిత వర్చువల్ సహాయకారి మొబైల్ అప్లికేషన్ ఇది .
- దీని ద్వారా వివిధ కంపెనీలతో వినియోగదారులు తమ లావాదేవీ నిర్వహించుకోవచ్చు . శాంసంగ్ , కోకాకోలా, ఫ్యూచర్ , రిటైల్ , టాటా గ్రూప్ , ఓయో రూమ్స్ , మహీంద్రా గ్రూప్ వంటివి ఈ సంస్థ ఖాతాదారులు .
4. భారత్ వృద్ధి 7.2 శాతమే
- 2019-20 కి కోత విధించిన ఎడిబి
- అంతర్జాతీయ గిరాకీ మందగించడం , దేశీయంగా చుస్తే పన్ను వసూళ్లు తగ్గడం , ఇందుకు ప్రధాన కారణంగా ఎడిబి పేర్కొంది .
- బలహీన వ్యవసాయ ఉత్పాదకత , వినియొగం , అధిక చమురు , ధరలు , తక్కువ ప్రభుత్వ వ్యయాలు , ప్రభావం చూపాయని తెలిపింది .
- 2019-20 లోను ప్రపంచంలో అత్యంత వేగవంతమైన వృద్ధి సాధిస్తున్న ఆర్ధిక వ్యవస్థ గా భారత్ కొనసాగనుంది .
No comments:
Post a Comment