Tuesday, June 11, 2019

ధ్రువ ప్రత్రాల కోసం ధ్రువ పోర్టల్


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ప్రతి ఒక్కరికి అవసరమయ్యే ధ్రువ పత్రాలను ఎలక్ట్రానిక్ రూపం లో అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం , ధ్రువ పేరుతో ఆన్లైన్ పోర్టల్ ను , మొబైల్ అప్ ను రూపొందించబోతోంది .  2019 వ సంవత్సరం లో నే పైలట్ ప్రాజెక్ట్ కింద పదవ  తరగతి , ఇంటర్ బోర్డులు , జేఎన్టీయూ , కృష్ణ యూనివర్సిటీ లు జారీ చేసే సర్టిఫికెట్ లను , ఇవి కాక రవాణా శాఖ జారీ చేసే  లైసెన్స్ , ఆర్సీ బుక్ లను ఎలక్ట్రానిక్ రూపం లో ధ్రువ పోర్టల్ ను అతి త్వరలోనే అందుబాటులో ఉంచనున్నారు . 

ఈ పోర్టల్ లో ప్రతి పౌరుడికి ఒక డిజిటల్ లాకర్ ఉంటుంది . ఇందులో ధ్రువ పత్రాలను ఉంచుతారు . మనకు కావలసినప్పుడు వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు . 

ప్రతి సర్టిఫికెట్ పైన ధ్రువ ముద్ర ఉంటుంది . ఆ సర్టిఫికెట్లు అసలైనవేనని ఆ ముద్ర ధృవీకరిస్తుంది . 

కేంద్ర ప్రభుత్వం ' డిజిలాకర్ ' తో పోలిస్తే ధ్రువ పూర్తిగా బిన్నంగా ఉంటుంది .  డిజిలాకర్ లో పౌరులు నేరుగా తమ సర్టిఫికెట్లను భద్రపర్చుకోవచ్చు . కానీ అవి అసలైనవేనని ధృవీకరించిన తర్వాతే ధ్రువ ముద్ర పడుతుంది . 

No comments:

Post a Comment