Friday, March 27, 2020

73వ బాఫ్టా పురస్కారాలు


లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ లో 2020 ఫిబ్రవరి 2న నిర్వహించిన 73వ బ్రిటిష్ అకాడమీ అఫ్ ఫిల్మ్  టెలివిషన్ ఆర్ట్స్ పురస్కారాలు విజేతలకు అందజేశారు . 

ఈ పురస్కారాలు బ్రిటిష్ ఫిల్మ్ అకాడమీ కింద 1947 లో ప్రారంభించారు. ఈ అవార్డు లో మనిషి ముఖం రూపం లో ఉన్న మాస్క్ ను విజేతలకు ట్రోఫీ గా అందజేస్తారు. 

ఈ పురస్కారాలను 2019వ సంవత్సరంలో విడుదలైన చిత్రాలకు అందించారు 

ఇందులో మొదటి ప్రపంచ యుద్ధం నేపధ్యం లో చిత్రీకరించిన ' 1917 '  చిత్రానికి అత్యధికంగా 7 పురస్కారాలు లభించాయి . ' జోకర్ '  సినిమా మూడు విభాగాల్లో పురస్కారాలు అందుకొని తరువాత స్థానంలో ఉంది. 

ముఖ్యాంశాలు - 
ఉత్తమ చిత్రం - 1917 ( ఉత్తమ బ్రిటిష్ చిత్రం కూడా ) 
ఉత్తమ దర్శకుడు - శామ్ మెండిస్ ( 1917 )
ఉత్తమ నటుడు - జొర్విన్ ఫోనిక్స్ ( జోకర్ )
ఉత్తమ నటి - రెని జెల్ వెగర్ ( జూడి ) 
ఉత్తమ సహాయ నటుడు - బ్రాడ్ పీట్ ( వన్స్ అపాన్ ఏ టైం ఇన్ హాలీవుడ్ ) 
ఉత్తమ సహాయనటి - లౌర డెర్న్ ( మ్యారేజ్ స్టోరీ ) 
ఉత్తమ ఆంగ్లేతర చిత్రం - పారసైట్ ( దక్షిణ కొరియా చిత్రం ) 
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే - పారసైట్


No comments:

Post a Comment