జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370 అధికారణాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించింది.
జమ్మూ కాశ్మీర్ ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది.
2019 ఆగష్టు 5న చేసిన చట్టం ద్వారా ఇక పై జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ కలిగిన కేంద్రపాలిత ప్రాంతంగాను , లద్ధాఖ్ అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతం గాను ఏర్పడ్డాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి 31 అక్టోబర్ నుంచి ఇది అమలులోకి వచ్చింది.
జమ్మూ కాశ్మీర్ పునర్ వ్యవస్తీకరణ బిల్లు రాజ్య సభ మరియు లోక్ సభ ల్లో ఆమోదించటం తో , బిల్లు చట్ట రూపం దాల్చింది. దీంతో 2019 ఆగష్టు 6న రాష్ట్రపతి అధికారికంగా ఆర్టికల్ 370లో అన్ని నిబంధనలు రద్దవుతున్నాయని ప్రకటించారు.
పార్లమెంట్ ఆమోదంతో ఇక పై జమ్మూ కాశ్మీర్ లో కేంద్ర చట్టాలన్నీ అమలవుతాయి. 370 అధికరణం రద్దు అవడంతో రాష్ట్రానికి ప్రత్యేక రాజ్యాంగం , ప్రత్యేక జెండా , ప్రత్యేక స్థాయి వంటి అంశాలు కూడా రద్దయిపోయాయి.
No comments:
Post a Comment