Thursday, November 15, 2018

ANDHRA PRADESH GOVERNMENT NEW LOGO







ఆంధ్ర ప్రదేశ్ కు కొత్త అధికారిక చిహ్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది .

మల్టీకలర్ , నీలం , నలుపు , తెలుపు రంగుల్లో చిహ్నాన్ని ఖరారు చేశారు .

అమరావతి శిల్ప కళ స్ఫూర్తి  తో దీన్ని తీర్చిదిద్దారు .

ఈ చిహ్నం లో చుట్టూ త్రిరత్నాలు  మధ్యలో , మధ్యన అందంగా ఉన్న ఆకులు , రత్నాలతో అలంకరించిన ధర్మ చక్రం ఉంటుంది .
క్రీస్తు శకం ఒకటో శతాబ్ది లో ధాన్య కటక మహా చైత్యానికి విధికుడు అనే చర్మకారుడు బహుకరించిన పూర్ణ ఘట్టం , చిహ్నం మధ్యలో ఉంటుంది .

ఈ పూర్ణ ఘట్టం చుట్టూ మూడు వృత్తాలు వరుసగా 48 , 118 , 48 ముత్యాలతో అలంకరించి ఉంటాయి .

పూర్ణఘట్టం కింద జాతీయ చిహ్నమైన అశోక స్తంభం పై ఉన్న నాలుగు సింహాల బొమ్మ ఉంటుంది .

ప్రముఖ పురాతత్వ శాస్త్రవేత్త శివనాగిరెడ్డి మరియు కొంతమంది తో కలగలిపిన కమిటీ సిఫార్సు మేరకు అధికారిక చిహ్నాన్ని ఖరారు చేసింది .


ఎవరు అర్హులు  ?

1. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి  , మంత్రులు
2. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి .
3. రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శులు
4. అడ్వకెటే జనరల్
5. అన్ని ప్రభుత్వ విభాగాల అధిపతులు
6. జిల్లా కలెక్టర్లు
7. సచివాలయ మధ్యస్థాయి అధికారులు మరియు వారికి సమాన హోదా కలిగిన వారు .

ధన్యవాదాలు


No comments:

Post a Comment